వనపర్తి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్ర కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సమకాలీన పరిస్థితుల పట్ల సమగ్ర అవగాహన కలిగిన నాయకుడు కేటీఆర్ అని ప్రశంసించారు.
సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల సమస్యలను ఎండగడుతూ నేటి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్ భవిష్యత్తు తెలంగాణ నాయకుడని స్పష్టం చేశారు. అనంతరం కేటీఆర్ పేరిట వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.