స్టేషన్ ఘన్పూర్, జూలై 23 : వరి సాగులో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలోనే అధిక దిగుబడి వస్తుందని, రైతులు ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులకు సూచించారు. బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్వినిరెడ్డితో కలిసి డివిజన్ కేంద్రంలోని రిజ్వాయర్ ప్రధాన కుడి కాలువ ద్వారా పంటలకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వరి పొలాల్లో 24గంటలు నీరు ఉండడం వలన పంట దిగుబడి తక్కువగా వస్తుందన్నారు. వరి పొలానికి వారం రోజులు నీరు పెట్టి, వారం రోజులు నీరు లేకుండా ఉంచడం వలన అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్ర వేత్తలు చెబుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్దతిని రైతులు అలవాటు చేసుకోవాలని సూచించారు.
రైతులు కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలని, రైతుల పంటలను కాపాడేందుకు ఆన్, ఆఫ్ పద్దతిలో 10రోజుల పాటు నీటిని విడుదల చేసి, మరో పది రోజులు నీటి విడుదల ఆపనున్నట్లు కడియం పేర్కొన్నారు. ఈ విదంగా పంటలకు సాగు నీరు అందిస్తామని ఇందుకు రైతులు సహకరించాలని కడియం కోరారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు ఎస్ఈ సుధీర్, ఈఈ వినయ్‌బాబు, ఆర్డీవో డీఎస్.వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మార్కెట్ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్యా శిరీష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, బెలిదె వెంకన్న, పాలకుర్తి మాజీ సర్పంచ్ యాకంతారావు, రాపోలు మధుసూదన్ రెడ్డి, అజయ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.