పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి శంకర్ ను మరోమారు నియమించినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపర్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ శంకర్ డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సింగరేణి అధికారులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాడు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల ర
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధనలో భాగంగా సింగరేణి అధికారుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని ఏరియాలలో నిరసన ర్యాలీల అనంతరం గత వారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని యా
సింగరేణి కార్మిక క్షేత్రంలోని సెంటినరీ కాలనీ నుంచి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ముఖ్యంగా ఆర్జీ-3 జీఎం కార్యాలయానికి అత్యంత సమీపంలోనే నడి రోడ్డ
ప్రజల సౌకర్యార్థం పెట్రోల్ పంపు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల గ్రామంలో సుల్తానాబాద్ ప్రాథమిక �
సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ సమ్మెకైనా వెనుకాడదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే-11వ ఇంక్లైన్ లో శనివారం జరిగిన గేట్ మీటింగ్
గోదావరిఖని మార్కెట్ ఏరియాలో 40 ఫీట్ల రోడ్డు నిర్మిస్తామని, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయిస్తే లైసెన్సు రద్దు చేసి మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు.
ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదని మానవసేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తూ రామగుండం లయన్స్ క్లబ్ అక్షయపాత్రగా నిలిచిందని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు మితి మీరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తల కేసుల మీద అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇంద
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మొహరం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఓదెల, కొలనూర్, కనగర్తి, గుంపుల, పొత్కపల్లి, నాంసానిపల్లి గ్రామాల్లో సాంప్రదాయం ప్రకారం పీరీలను నిలబెట్టారు. శుక్రవారం చివరి రోజ�
రామగుండంలో మూతపడిన 62.5మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ సందర్శించారు. రాష్ట్ర జెఎన్కో సీఎండీ ఎస్ హరీశ్, థర్మల్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజశేఖర�