Electricity problems | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 5 : విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యుత్ ఏఈ షఫీవోద్దీన్ అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామంలో గురువారం విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ సరఫరా పై అవగాహన కల్పించారు. అనంతరం ఏఈ మాట్లాడుతూ గ్రామంలో ఏమైనా విద్యుత్ సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కరంటు ఎక్కువ, తక్కువ వచ్చినా గాని తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. విద్యుత్ వైర్లకు ఎక్కడైనా చెట్ల కొమ్మలు అనుకుని ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమ్మెత్తల శోభ రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ తిప్పారపు రాజయ్య, వార్డ్ సభ్యులు తాండ్ర అంజయ్య, లైన్ మెన్ రాజు, జేఎల్ఎం రమేష్, సిబ్బంది శంకరయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.