AUS vs BAN | ఆస్ట్రేలియాపై తంజిద్ రికార్డు శతకం.. తొలి టెస్టులో పట్టుబిగించిన బంగ్లాదేశ్..!
AUS vs BAN : తొలి టెస్టులో ఆసీస్‌ను 198కే ఆలౌట్ చేసిన బంగ్లా.. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కంగారూ పేసర్లను ధీటుగా ఎదుర్కొన్న ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్(101) శతకంతో చెలరేగి జట్టుకు భారీ స్కోరందించాడు.
AUS vs BAN : ఒకప్పుడు ఆస్ట్రేలియా పర్యటన అంటేనే భయపడే బంగ్లాదేశ్(Bangladesh) ఇప్పుడు బెబ్బులిలా రెచ్చిపోతోంది. తొలి టెస్టులో ఆసీస్‌ను 198కే ఆలౌట్ చేసిన బంగ్లా.. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కంగారూ పేసర్లను ధీటుగా ఎదుర్కొన్న ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్(101) శతకంతో చెలరేగి జట్టుకు భారీ స్కోరందించాడు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(84) సైతం క్రీజునంటుకోగా కమిన్స్ నేతృత్వంలోని పేస్ దళం నీరుగారిపోయింది. ఫలితంగా 150 పరుగులకు పైగా ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టుబిగించింది బంగ్లాదేశ్.
గతంలో రెండుసార్లు బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్ తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా ఈసారి తడబడుతోంది. 23 ఏళ్ల తర్వాత కంగారూల గడ్డపై టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ షోతో డార్విన్ టెస్టులో పట్టుబిగించింది. తొలుత హసన్ మహమూద్(6-55) ఆరు వికెట్లతో ఆసీస్ నడ్డివిరవగా.. అనంతరం ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్(101) శతకంతో కదం తొక్కాడు. ఆస్ట్రేలియాపై టెస్టు సెంచరీ సాధించిన బంగ్లాదేశ్ తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు తంజిద్.
It’s Bangladesh in command after day 2 in Darwin!
➡️ https://t.co/dAZndhFv80 #AUSvBAN pic.twitter.com/7Z2lVh7ucT
— Cricinfo (@cricinfo) August 14, 2026
స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్.. వంటి దిగ్గజ పేసర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ కుర్రాడు.. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(84)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరి జోరుతో కుదేలైన ఆసీస్ బౌలర్లు ఆఖర్లో పుంజుకున్నారు. టీ సెషన్ తర్వాత లిటన్ దాస్(0)ను స్టార్క్, ముష్ఫికర్ రహీం(36)ను కమిన్స్ పెవిలియన్ పంపారు. వెంటవెంటనే రెండు వికెట్లు పడినా.. మెహిదీ హసన్ మిరాజ్(32 నాటౌట్), హసన్ మహమూద్(13 నాటౌట్)లు పట్టుదలగా ఆడారు. దాంతో, రెండో రోజు స్టంప్స్ సమయానికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 153 పరుగుల ఆధిక్యంలో ఉంది పర్యాటక జట్టు.
A historic moment as Tanzid Hasan Tamim became the first Bangladeshi batter to register a Test ton on Australian soil 👏pic.twitter.com/DWYkxlVGSf https://t.co/VQMrbTYhLX
— Cricbuzz (@cricbuzz) August 14, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

