Galle Test | టీమిండియా ఆరొందల టెస్టుకు వాన ముప్పు.. గాలే వాతావరణ నివేదిక ఇదే..!
Galle Test : విజయంతో రికార్డు టెస్టును చిరస్మరణీయంగా మలచుకోవాలని శుభ్‌మన్ గిల్ సేన భావిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
Galle Test : సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు (Team India) చరిత్రాత్మక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఆరొందల టెస్టు ఆడబోతున్న టీమిండియా.. గాలే స్టేడియంలో శ్రీలంకను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో విజయంతో రికార్డు టెస్టును చిరస్మరణీయంగా మలచుకోవాలని శుభ్‌మన్ గిల్ సేన భావిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC 2025-27)ర్యాంకింగ్స్‌లో ముందంజ వేయాలనుకుంటున్న భారత్‌కు నిరాశ తప్పదు.
తొమ్మిదేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్లింది భారత జట్టు. వామప్ మ్యాచ్‌లో అదిరే విజయంతో జోరుమీదున్న టీమిండియా అసలు పోరులోనూ దుమ్మురేపాలనుకుంటోంది. సుదీర్ఘ ఫార్మాట్లో 600ల మ్యాచ్ ఆడుతున్న భారత్.. లంకన చిత్తు చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే.. శుభ్‌మన్ గిల్ సేన ఉత్సాహంపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు. ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్‌కు వాతావరణం అనుకూలించలేదు.
According to BBC Weather, the first Test between India and Sri Lanka in Galle could face significant interruptions due to rain.
📸: DanuskaAravinda/X pic.twitter.com/TGmx0h0n01
— CricTracker (@Cricketracker) August 14, 2026
ఆగస్టు 15న గాలేలో తొలి మ్యాచ్‌కు దాదాపు ఐదు రోజులు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్ రోజుల్లో వాతావరణం చల్లగా ఉండడం, చిన్నపాటి జల్లులు పడే అవకాశముంది. ఇక ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియన్ నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనున్నాయి. ఫలితంగా తేమ ప్రభావం అధికంగా ఉండనుంది.
India’s 600th Test and Galle’s 50th Test tomorrow. Galle becomes the only ground in Asia to host 50 Tests. pic.twitter.com/BQ6vu3uUYm
— Rex Clementine (@RexClementine) August 14, 2026
అక్యూవెదర్ వర్ష సూచన ప్రకారం.. 90 శాతం వర్షం, మంచు లేదంటే చల్లని గాలులతో నిండి ఉంటుంది. 5.6 మిల్లీమీటర్ల వర్షం పడేందుకు ఆస్కారముంది. అలానే.. 92 శాతం పొగమంచు కారణంగా 5 కిలోమీటర్ల వరకూ దారి మసకగా ఉండే అవకాశముంది. అలానే.. గంటకు 20 కిలోమీటర్ల వేగం నుంచి.. 43 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని అంచనా. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం.. కూడా వర్ష సూచన ఉన్నందున గాలే టెస్టుకు పలుమార్లు అంతరాయం ఏర్పడనుంది. దాంతో.. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2017లో లంకను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. ఈసారి అదే ఫలితాన్ని రాబట్టే అవకాశాలు సన్నగిల్లే అవకాశముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

