Dasyam Vinay Bhasker | నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్’ అంటున్నారు : దాస్యం వినయ్ భాస్కర్
Dasyam Vinay Bhasker | ఈ నెల 22న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలైందని హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.
Dasyam Vinay Bhasker | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 25 : 420 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్ ’ అంటున్నారని, ఈ లిల్లీపుట్ చెబితే కొందరు పోలీసులు యాక్షన్ చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు.
బుధవారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ నాయిని రాజేందర్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ నెల 22న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలైందని విమర్శించారు. సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు, అనవసర వ్యాఖ్యలకు దిగుతున్నారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని స్థాపించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఇలాంటి దాడులను యావత్ తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజలు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం చేస్తుందని, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక బీఆర్ ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకత్వం, ఉద్యమకారులకు అండగా నిలిచి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేసిన కేటీఆర్ , ఇతర నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని కేటీఆర్ కాలిగోటికి నాయిని సరిపోడన్నారు.
Read Also :
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasyam Vinay Bhasker | నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్’ అంటున్నారు : దాస్యం వినయ్ భాస్కర్
‘కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలి’
Ala Venkateswar Reddy | కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ArjunKapoor | మలైకాతో బ్రేకప్.. అర్జున్ కపూర్, సాహిబా బాలి డేటింగ్ నిజమేనా? వైరల్ అవుతున్న ఫోటో!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

