‘కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలి’
తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి, కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ), నల్లగొండలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చేపట్టారు. బుధవారం...
– ఎంజీయూ రిజిస్ట్రార్ చాంబర్ ఎదుట కాంట్రాక్ట్ అధ్యాపకుల ధర్నా
– రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
రామగిరి, నవంబర్ 25 : తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి, కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ), నల్లగొండలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చేపట్టారు. బుధవారం విశ్వవిద్యాలయంలోని రిజిస్ట్రార్ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకుని తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని, ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.చింత స్యామ్ సుందర్, డా.రవీందర్ రెడ్డి, డా. తిరుపతయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలి’
Ala Venkateswar Reddy | కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ArjunKapoor | మలైకాతో బ్రేకప్.. అర్జున్ కపూర్, సాహిబా బాలి డేటింగ్ నిజమేనా? వైరల్ అవుతున్న ఫోటో!
Pujita Ponnada |వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాపై నటి పూజిత పొన్నాడ షాకింగ్ కామెంట్స్.. నన్ను మోసం చేశారంటూ ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

