‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ స్థలం మార్చాలి’
టేకులపల్లి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని టేకులపల్లి ప్రజలు కోరుతున్నారు. బేతంపూడి పరిధిలో ఇల్లెందు–కొత్తగూడెం ప్రధాన రహదారికి సమీపంలోని సర్వే నంబర్ 282/82లో ఉన్న సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో...
– బేతంపూడి రెవిన్యూ పరిధిలోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని టేకులపల్లి వాసుల విజ్ఞప్తి
టేకులపల్లి, నవంబర్ 25 : టేకులపల్లి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని టేకులపల్లి ప్రజలు కోరుతున్నారు. బేతంపూడి పరిధిలో ఇల్లెందు–కొత్తగూడెం ప్రధాన రహదారికి సమీపంలోని సర్వే నంబర్ 282/82లో ఉన్న సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో పాఠశాల నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాన రహదారికి సమీపంలో విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రభుత్వ భూమిలో పాఠశాల నిర్మిస్తే మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ స్థలం అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, విద్యాశాఖ ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల నిర్మాణ స్థలాన్ని బేతంపూడి పరిధిలోని ప్రభుత్వ భూమికి మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తొమ్మిదో మైలు తండా గ్రామస్తుడు బానోతు భద్రు, దాస్తాండ పంచాయతీ సర్పంచ్ చందర్ సింగ్ రాథోడ్, లచ్చతండ గ్రామస్తుడు శ్రీనివాస్ కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ స్థలం మార్చాలి’
జిల్లా, రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ విద్యార్థినుల ఎంపిక
Watch: కోర్టు వద్ద హత్య కేసు నిందితుడి చేయి నరికివేత.. కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తులు
Dasyam Vinay Bhasker | నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్’ అంటున్నారు : దాస్యం వినయ్ భాస్కర్
‘కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

