Watch: కోర్టు వద్ద హత్య కేసు నిందితుడి చేయి నరికివేత.. కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తులు
Attack At Pune Court | ఒక హత్య కేసులో నిందితుడైన వ్యక్తిపై కోర్టు వద్ద దాడి జరిగింది. కొందరు వ్యక్తులు కత్తులతో అతడి చేతిని నరికారు. ఆ తర్వాత ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. కోర్టు వద్ద జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది.
ముంబై: ఒక హత్య కేసులో నిందితుడైన వ్యక్తిపై కోర్టు వద్ద దాడి జరిగింది. కొందరు వ్యక్తులు కత్తులతో అతడి చేతిని నరికారు. ఆ తర్వాత ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. కోర్టు వద్ద జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. (Attack At Pune Court) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఒక హత్య కేసులో నిందితుడైన 35 ఏళ్ల మందార్ మారుతి కివాలే, బుధవారం మధ్యాహ్నం కోర్టు విచారణ కోసం శివాజీనగర్ కోర్టు వద్దకు చేరుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు పెద్ద కత్తులతో దాడి చేసి ఒక చేతిని నరికారు. కిందపడిన అతడిపై కాల్పులు జరిపి కొందరితో కలిసి రెండు స్కూటర్లపై పారిపోయారు. చేయి తెగడంతో రక్తంతో తడిచిన మందార్ మారుతి పైకి లేచి నడిచేందుకు ప్రయత్నించి కిందపడిపోయాడు.
కాగా, సంఘటనా స్థలం నుంచి రెండు పిస్టల్స్, ఒక మ్యాగజైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మందార్ మారుతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. దాడి చేసి పారిపోయిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు 2025 ఏప్రిల్‌లో పూణెలోని సంతోష్‌నగర్‌లో భూ వివాదం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 26 ఏళ్ల రెస్టారెంట్ యజమాని శుభమ్ సుభాష్ చవాన్‌ను కొందరు వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమర్ సకోరే సహా గిరీష్ సుభాష్ బాబరే, యోగేష్ బాబూరావు డోరేతో పాటు మందార్ మారుతి కివాలే అరెస్టయ్యాడు.
అయితే నాలుగు రోజుల కిందటే జైలు నుంచి విడుదలైన మందార్ మారుతి, గురువారం విచారణ కోసం కోర్టు వద్దకు చేరుకున్నాడు. మాటు వేసిన ప్రత్యర్థులు మందార్పై కత్తులతో దాడి చేయడంతో పాటు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Daylight firing outside Pune’s Shivajinagar Court! 6–7 attackers reportedly arrived on scooters, opened fire and attacked a man with koytas before fleeing. Two guns and a loaded magazine were found at the scene. https://t.co/IsFmtQAhZD
— Deadly Kalesh (@Deadlykalesh) November 25, 2026
#WATCH | Mandar Kivde was attacked by around four to five assailants outside the Shivajinagar Court premises in #Pune at about 1:15 pm, suffering sharp-weapon injuries before being taken to a hospital. Pune City Police said treating doctors noted no firearm injuries, though officers recovered two firearms from the spot and identified the suspects. According to police, Kivde had a 2025 murder case registered against him and had recently been released on bail.
— The Federal (@TheFederal_News) November 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- accused
- chopped off
- hand
- machete
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: కోర్టు వద్ద హత్య కేసు నిందితుడి చేయి నరికివేత.. కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తులు
Dasyam Vinay Bhasker | నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్’ అంటున్నారు : దాస్యం వినయ్ భాస్కర్
‘కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలి’
Ala Venkateswar Reddy | కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

