తాండూర్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ మేరకు హమాలీలకు ( Hamalees ) వెల్ఫేర్ బోర్డు ( Welfare Board ) ఏర్పాటు చేయాలని హమాలీల సంఘం,
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోమాస ప్రకాష్, సహాయ కార్యదర్శి దాగం రాజారాం డిమాండ్ చేశారు. తాండూర్ తహసీల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ జ్యోత్స్నకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలకు రూ.6వేలు పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన హమాలీలకు రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, హమాలీ కార్మికులు ఇందూరి మల్లేష్, చింతపురి లక్ష్మణ్, ధర్మరాజుల వెంకటేష్, చదువుల రవీందర్, తోగారి శ్రీను, తాండూర్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.