Charlapalli : ఎనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులోని నాలుగో నిందితుడు గుండెపోటుతో మృతి చెందాడు. చర్లపల్లి జైలులో మగ్గుతున్న ఏ4 అబ్దుల్ బారీ గురువారం మరణించాడు. ఛాతిలో నొప్పితో బాధ పడుతున్న అతడిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అబ్దుల్ ప్రాణాలు విడిచాడు. దాంతో, ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు. ప్రధాన నిందితుడు మారుతి రావు ఆరేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు అబ్దుల్ గుండెపోటుతో మరణించాడు.
తెలంగాణలో ఎనిమిదేళ్ల క్రితం నాటి ప్రణయ్ పరువు హత్య కేసులో నాలుగో నిందితుడైన అబ్దుల్ బారీ మరణించాడు. 2025 మార్చిలో నల్లగొండ కోర్టు తీర్పు అనంతరం.. చర్లపల్లి జైల్లో ఉంటున్న అతడికి గురువారం గుండెపోటు వచ్చింది. దాంతో, పోలీసులు వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ అబ్దుల్ ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. ఏ4 అయిన అతడి మరణంతో ఈ కేసులో మిగిలిన నిందితులు ఇద్దరు మాత్రమే. ఒకరు కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మ (కోర్టు ఉరిశిక్ష విధించింది), రెండో వ్యక్తి అమృత బాబాయి శ్రవణ్ కుమార్(బెయిల్ వచ్చింది).
ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్, అమృత జీవితంలో 2018 సెప్టెంబర్ 14 చీకటి రోజుగా మిగిలిపోయింది. గర్భిణి అయిన అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రణయ్‌ను కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మ కత్తితో నరికి చంపాడు. దళితుడైన ప్రణయ్ హత్యోదంతం అప్పట్లో పెద్ద సంచలనం. ఈ కేసును విచారించిన నల్గొండ కోర్టు అబ్దుల్ బారీతో సహా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు, సుభాష్‌కు మరణ శిక్ష విధించింది.
ఈ కేసులో విచారణ కొనసాగుతుండగానే 2020, మార్చి 8వ తేదీన అమృత తండ్రి, ప్రధాన నిందితుడు మారుతి రావు ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీవిత ఖైదును సవాల్ చేస్తూ అతడు పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ విచారణ ముగిసేవరకు తనకు బెయిల్ ఇవ్వాలని శ్రవణ్ కోర్టును కోరాడు. అతడి వయసు, జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు బెయిలు ఇచ్చింది.
ప్రణయ్ హత్య కేసులో A-4గా ఉన్న దోషి అబ్దుల్ బారీ మృతి
చర్లపల్లి జైలులో ఛాతీ నొప్పితో బాధపడుతున్న అబ్దుల్ బారీని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన అబ్దుల్ బారీ
అమృతను పెళ్లి చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 14, 2018న పరువు హత్యకు గురైన ప్రణయ్… https://t.co/unMWzSsjqO pic.twitter.com/J4aS8zfBQx
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026