Sudhanshu Trivedi : సర్ (SIR) ప్రక్రియను విమర్శిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (Chief Election Commissioner) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మీడియా కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలకు బీజేపీ (BJP) కౌంటర్ ఇచ్చింది. రాహుల్‌గాంధీకి రాజకీయాలపై అవగాహన లేదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) సుధాన్షు త్రివేది (Sudhanshu Trivedi) విమర్శించారు. కాంగ్రెస్ పతనానికి సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్‌గాంధీనే కారణమని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘంలో కమిషనర్ల విభేదాలపై ఎన్నికల అధికారులు ఎవరూ కూడా స్పందించలేదన్నారు.
సర్ ప్రక్రియను నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని, సర్ ప్రక్రియను వద్దంటే దేశద్రోహానికి పాల్పడినట్లేనని సుధాన్షు వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తంచేసిందని గుర్తుచేశారు. ఆ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. అస్సాం, బెంగాల్లో సర్ ద్వారా ఓట్లు తొలగించారని, నిజాలు తెలియకుండా రాహుల్ గాంధీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సుధాన్షు మండిపడ్డారు. రాహుల్, ఆయన చెల్లి ప్రియాంకాగాంధీ వాద్రాకు సొంత రాష్ట్రంలో గెలిచే దమ్ము లేదని ఎద్దేవా చేశారు.
అందుకే వయనాడ్‌లో ముస్లిం లీగ్ మద్దతుతో ఆ ఇద్దరూ గెలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో భారీ ఎత్తున రిగ్గింగ్, ఎన్నికల అక్రమాలు జరిగాయని ఆరోపించారు.