Dasari Manohar Reddy | కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే గోస పడుతరు.. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
కాంగ్రెసోళ్ల మాయ మాటలు నమ్మితే పెద్దపల్లి పట్టణ ప్రజలు మరో ఐదేండ్లు గోస పడుతారని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన ప్రజలకు ఓరగబెట్టిందని ఏమీ లేదని విమర్శించారు.
Dasari Manohar Reddy | పెద్దపల్లి, ఫిబ్రవరి 5 : కాంగ్రెసోళ్ల మాయ మాటలు నమ్మితే పెద్దపల్లి పట్టణ ప్రజలు మరో ఐదేండ్లు గోస పడుతారని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన ప్రజలకు ఓరగబెట్టిందని ఏమీ లేదని విమర్శించారు. పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి ఆయన గురువారం ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా 11వ వార్డు అభ్యర్థి పూదరి లత-చంద్రశేఖర్‌తో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పెద్దపల్లి పట్ల అమితమైన ప్రేమ ఉందని, దానిని నిదర్శనం పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయటమే. బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి పట్టణాభివృద్ధికి వందలాది కోట్లు ఖర్చు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. 2014 ముందు పెద్దపల్లి ఎట్లా ఉండే? 2014 తర్వాత ఎట్లా ఉందో? పట్టణ వాసులు ఆలోచన చేయాలన్నారు. ఓటు వజ్రాయుధమని, అభివృద్ధి చేసిన వారికి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఓటు వేయమని అడిగితే… ఎందుకు ఓటు వేయాలని చెప్పాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలకు నెల రూ.2500 ఇవ్వనందుకు ఓటు వేయాలా..? పెన్షన్ పెంచనందుకు ఓటు వేయాలాజజ? రైతు బందు( భరోసా) ఎగ్గోట్టినందుకు ఓటు వేయాలా..? నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు ఓటు వేయాలా..? అని ప్రశ్నించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన పెద్దపల్లి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఎన్నికల సమయంలో హడావిడిగా శంకుస్థాపనలు చేసి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులకు ఎన్నికప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని, ఎన్నికల తర్వాత ఆ నాయకులు కన్పించరన్నారు. పెద్దపల్లి మున్సిపల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకలు మాజీ ఎంపీటీసీ వైద శ్రీనివాస్, కందుకూరి అనిల్, యాకూబ్, మామిడి శిరీష్ కుమార్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి పలు పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో గురువారం చేశారు. వైద సంజీవ్, ఆకుల నారాయణ, మారుతి, అనిల్‌కు బుధవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు వారి ఇంట్లో బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పగా, గురువారం స్వచ్ఛందంగా వారు బీఆర్ఎస్లో చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే చేరిన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరిలా… ప్రతి కార్యకర్త సైనికులా పని చేయాలని పిలుపు నిచ్చారు. వైద సంజీవ్, ఆకుల నారాయణ, మారుతి, అనిల్, వైద రమేష్, కొండి రాజయ్య, కొండి శంకర్, కొండి కనకయ్య, వేములు వెంకటేశం, వేములు రాజేశం, మల్లయ్య, వైద మోనయ్య తదితరులు బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

