Manthani | అనారోగ్యంతో మంథని మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి మృతి
మంథని మాజీ శాసనసభ్యుడు చంద్రుపట్ల రాంరెడ్డి (80) మంగళవారం తుది శ్వాస విడిచారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రామ్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు.
Manthani | మంథని, ఫిబ్రవరి 3 : మంథని మాజీ శాసనసభ్యుడు చంద్రుపట్ల రాంరెడ్డి (80) మంగళవారం తుది శ్వాస విడిచారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రామ్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం ముత్తారం మండల ఎంపీపీగా పని చేశారు. టీడీపీ ఆవిర్భావంలో ఆ పార్టీలో చేరిన ఆయన 1994లో అప్పటి స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావుపై ఘన విజయం సాధించి 1999 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. అంచలంచలుగా ఎదిగిన ఆయన డైనమిక్, మాస్ లీడర్‌గా పేరుగాంచారు.
అనంతరం బీ(టీ)ఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం కీలక పాత్ర పోషించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు చంద్రుపాట్ల సునీల్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన తుది శ్వాస విడిచారు. రామ్ రెడ్డి మృతితో మంథని నియోజకవర్గం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనతో ఉన్న సంబంధాలను, ఆయన చేసిన అభివృద్ధి పనులను చర్చించుకుంటూ ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

