Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్, ఫిబ్రవరి 2 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎద్దులాపూర్ గ్రామంలో రూ.5 లక్షల నిధులతో చేపట్టిన బోర్వెల్ను సోమవారం ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం తీర్చేందుకు పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రూ.ఐదు లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా గ్రామంలో బోర్ వేయించి తాగునీటి ట్యాంకుకు కనెక్షన్ ఇప్పించి బోర్ వెల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, సర్పంచ్ మామిడి లత అశోక్, ఉప సర్పంచ్ హరీష్, వార్డు సభ్యులు జక్కుల కొమురయ్య, అల్లం రాజకుమార్, మాజీ ఉపసర్పంచులు తాళ్ల పెళ్లి మోగి గిలయ్య, గొర్ల దేవేందర్, నాయకులు మాజీ వార్డు సభ్యులు, గ్రామస్తులు సల్పాల శ్రీనివాస్, మామిడి రమేష్, అల్లం రాజయ్య, బంగారపు రవి, అల్లం రమేష్,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.