NandiMedaram | నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టుకు శాశ్వత భవనం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు జిల్లా జడ్జి సునీత పేర్కొన్నారు.
- స్థల పరిశీలన చేసిన జిల్లా జడ్జి సునీత
NandiMedaram | ధర్మారం, ఫిబ్రవరి 5 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు జిల్లా జడ్జి సునీత పేర్కొన్నారు. గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయం ఎదుట ఉన్న ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్ భవనం ఎదురుగా ఉన్న స్థలంతోపాటు శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న స్థలాన్ని జడ్జి సునీత గురువారం పరిశీలించారు.
ఈ రెండింటిలో ఏ స్థలం కోర్టు భవన నిర్మాణానికి అనువుగా ఉంటుందో సర్వే చేసి కేటాయించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నంది మేడారం సివిల్ కోర్టు జడ్జి ఎం సరిత, తహసీల్దార్ డీ శ్రీనివాస్, ఆర్ఐ నవీన్ రావు, సర్వేయర్ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి, న్యాయవాదులు బొట్ల లక్ష్మీ నర్సయ్య, ఆకారి రాజేశం, భీమారపు సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

