Promotions : రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 48 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వీరి పదోన్నతులకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ పచ్చజెండా ఊపడంతో వెంటనే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రిన్సిపల్‌గా ప్రమోషన్ పొందిన 48 మంది జూనియర్ లెక్చరర్లలో 38 మంది సంతోషం వ్యక్తం చేయగా.. పదిమంది మాత్రం నాట్ విల్లింగ్ అని ఆప్షన్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో, వీరి స్థానంలో మరో 10 మందికి పదోన్నతులు కల్పించే అంశాన్ని విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.