Viral News | వస్త్ర దుకాణంలో రూ.16 ఆఫర్.. జనం పోటెత్తడంతో తొక్కిసలాట.. చివరికి ఏమైందంటే..!
Viral News | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ నగరం (Kanpur City) లో ఓ వస్త్ర దుకాణదారుడు తన కుమారుడి జన్మదినం సందర్భంగా ప్రకటించిన రూ.16 కే దుస్తుల ఆఫర్ ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయిన ఈ ప్రకటనను చూసి నాలుగు వేల మందికిపైగా జనం ఒక్కసారిగా దుకాణం వద్దకు పోటెత్తడంతో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది.
Viral News : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ నగరం (Kanpur City) లో ఓ వస్త్ర దుకాణదారుడు తన కుమారుడి జన్మదినం సందర్భంగా ప్రకటించిన రూ.16 కే దుస్తుల ఆఫర్ ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయిన ఈ ప్రకటనను చూసి నాలుగు వేల మందికిపైగా జనం ఒక్కసారిగా దుకాణం వద్దకు పోటెత్తడంతో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి.
అన్వర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలమ్ మార్కెట్లో రయీస్ ఆలం అనే వ్యక్తి వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 15న తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. కేవలం 16 నిమిషాల వ్యవధిలో ఎవరైనా సరే కేవలం 16 రూపాయలకే సూట్లు, జీన్సులు, షర్టులు వంటి రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేయవచ్చని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ప్రకటన క్షణాల్లో వైరల్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది జనం దుకాణం ముందు బారులు తీరారు.
ఆఫర్ను దక్కించుకునేందుకు జనం ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పలువురు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో భయాందోళనకు గురైన దుకాణదారుడు రయీస్ ఆలం దుకాణానికి తాళంవేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న అన్వర్గంజ్, బేగమ్గంజ్ పోలీసులతో పాటు ఏసీపీ మంజయ్ సింగ్ భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
లాఠీలు పట్టుకుని లౌడ్స్పీకర్ల ద్వారా ప్రజలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దుకాణం వెలుపల దొరికిన యజమాని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ జనసమూహాన్ని కూడగట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు దుకాణదారుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chaos
- Kanpur
- Telugu News
- viral news
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

