హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఏపీలో అమల్లోకి తెస్తున్న ఇన్ఫ్ల్లుయెన్సర్ల పాలసీపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ టా ర్గెట్గా ఈ పాలసీ అమలు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఏపీలో తాజా పరిణామాలపై సోషల్ మీడియాలో భారీ చర్చ సాగుతున్నది. ఇటీవల డీఎస్సీ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగినట్టు అక్కడి ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తూ భారీ ఆందోళన కూడా చేపట్టింది. సూపర్ సిక్స్ అమలు విషయంలోనూ కొంత వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇన్ఫ్ల్లుయెన్సర్లను ఉపయోగించుకొని ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే వారే టార్గెట్‌గా కంటెంట్ క్రియేట్ చేయించబోతున్నట్టు సమాచారం. దీంతో పాటు తెలంగాణపై విషం చిమ్మడానికి కూడా ఈ పాలసీని వినియోగిస్తారనే వాదన వినిపిస్తున్నది.
రాష్ట్ర విభజన పూర్తయి 12 ఏండ్లు గడుస్తున్నా ఏపీ ముఖ్య నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నారు. సోషల్ మీడి యా వేదికగా ఈ దాడి మరింత పెరిగింది. ఏపీకి చెందిన తెలుగు సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లు ఎక్కువగా హైదరాబాద్ కేంద్రంగానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరంతా తెలంగాణ గడ్డపై నుంచే రాష్ట్ర రాజకీ య పరిణామాలు, పాలనాపరమైన లోపాల ను ఎత్తి చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో పాటు సినిమా పేర్లు, అందులో వాడే భాష, క్యారెక్టర్లను కించపరుస్తూ ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేస్తున్నారనే విమర్శలున్నా యి. ఇటీవల ‘ఇడుపు కాయితం’ సినిమా టైటి ల్ వివాదం ఆ కోవలోనిదేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా నాని నటించిన ‘ప్యారడైజ్’ విషయంలోనూ తెలంగాణ మాండలికం, కేసీఆర్‌ను పోలిన క్యారెక్టర్ ఉం డటంతో పనిగట్టుకొని సోషల్‌మీడియా వేదిక గా నెగిటివ్ ప్రచారం చేశారు. దీనిపై వాట్సాప్ గ్రూప్‌లతో పాటు ఫేస్బుక్, ఇన్‌స్టా, ఎక్స్ వేదికగా తెలంగాణ యువత మండిపడింది.
తెలంగాణకు చెందిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసిన ప్యారడైజ్ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో తెలంగాణ యాసను, ఉద్యమనేత కేసీఆర్ క్యారెక్టర్ ఉండటాన్ని తట్టుకోలేక ఏపీకి చెందిన పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఇన్‌ఫ్ల్లుయెన్సర్లు ఎదురు దాడికి దిగా రు. సినిమా యూనిట్‌పై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారు. సినిమా మొదలు కాకముందే వీరంతా ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ అటాక్ చేసినట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వీరికి నజరానా కల్పి స్తూ తెలంగాణతోపాటు బీఆర్ఎస్ నేతలపై విషప్రచారం చేయించేందుకు వినియోగించుకోనుందనే ప్రచారం ఊపందుకున్నది. ప్రభు త్వ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే వీరి సేవలు వినియోగించుకోనున్నట్టు చెప్తున్నా, అసలు విషయం వేరే ఉన్నదనే చర్చ జరుగుతున్నది. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌కు అనుకూలంగా ప్రతిపక్ష బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కంటెంట్‌ను తయారు చేయించనున్నట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్‌కు ఏపీ అధికార పెద్దలతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో జరిగేది ఇదేననే వాదన వినిపిస్తున్నది. ఏపీలో ప్రతిపక్షంపై ఎదురుదాడిచేస్తూనే, తెలంగాణ సమాజం, తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేతలపై కుట్రలకు తెరలేపినట్టుగా నెటిజన్లలో చర్చ జరుగుతున్నది. అయితే తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా ఇన్‌ఫ్ల్లుయెన్సర్లు కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణవాదులు నొక్కి చెప్తున్నారు. దాడికి ప్రతిదాడి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం జోలికి వచ్చే ఆంధ్రా ఇన్ఫ్ల్లుయెన్సర్లకు గట్టి బుద్ధి చెప్తామని స్పందిస్తున్నారు.
తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడి రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన బీఆర్ఎస్ పార్టీపై సైతం ఏపీకి చెందిన పలువురు ఇన్ఫ్ల్లుయెన్సర్ల విషం చిమ్ముతున్నారు. ఏపీ చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ఎండగట్టడాన్ని జీర్ణించుకోలేక ఈ కుట్రకు తెరలేపినట్టుగా తెలుస్తున్నది. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్ల్లుయెన్సర్ల పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెబుతున్నా, ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం తెలంగాణపై విషం చిమ్మడమే అనే వాదన వినిపిస్తున్నది. ఏపీ ప్రభుత్వం మాత్రం లక్షకు పైగా ఫాలోవర్లు ఉంటే గరిష్ఠంగా రూ.15వేలు, 50వేల నుంచి 99,999 ఫాలోవర్లు ఉంటే రూ.7,500, 25వేల నుంచి 49,999 ఫాలోవర్లు ఉంటే రూ.5వేలు, పదివేల నుంచి 24,999 ఫాలోవర్లు ఉంటే రూ.2,500 పారితోషికంగా చెల్లించనున్నట్టు ప్రకటించడం గమనార్హం.