Hundred League : మహిళల హండ్రెడ్ లీగ్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో జయభేరి మోగించిన ట్రెంట్ రాకెట్స్ (Trent Rockets) తమ కలను సాకారం చేసుకుంది. లీగ్ దశలో దుమ్మురేపిన సన్‌రైజర్స్ లీడ్స్(Sunrisers Leeds)ను టైటిల్ పోరులో 91 పరుగులకే కట్టడి చేసిన రాకెట్స్.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అష్లే గార్డ్నర్ సారథ్యంలోని రాకెట్స్ ది హండ్రెడ్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
ఇంగ్లండ్ గడ్డపై నిర్వహించిన మహిళల హండ్రెడ్ లీగ్ 2026 టైటిల్‌ను ట్రెంట్ రాకెట్స్ ఒడిసిపట్టింది. లార్డ్స్ మైదానంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ లీడ్స్‌పై భారీ విజయంతో ఛాంపియన్‌గా అవతరించింది రాకెట్స్. చిన్నపాటి లక్ష్యాన్ని 54 బంతుల్లోనే ఊఫ్మనిపించింది గార్డ్నర్ బృందం. 92 పరుగుల ఛేదనలో ఓపెనర్లు సోఫియా డంక్లే(41), బేత్ మూనీ(31 నాటౌట్)లు శుభారంభమిచ్చారు.
The moment Trent Rockets sealed the 2026 Women’s Hundred title 👏
pic.twitter.com/bORwB9soHz— Cricinfo (@cricinfo) August 16, 2026
సన్‌రైజర్స్ బౌలర్లను ఎడాపెడా ఉతికేసిన ఈ ద్వయం బౌండరీతో స్కోర్‌బోర్డును ఉరికించింది. డంక్లే, నాట్ సీవర్ బ్రంట్(4)లు ఔటైనా.. కెప్టెన్ అష్లే గార్డ్నర్(9 నాటౌట్)తో కలిసి రాకెట్స్‌ను తొలిసారి హండ్రెడ్ లీగ్ విజేతగా నిలిపింది మూనీ.
లీగ్ దశలో సంచలన ఆటతో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ లీడ్స్ ఆఖరి మెట్టుపై తడబడింది. ఫామ్‌లో ఉన్న ఫొబే లిచ్‌ఫీల్డ్(10) సహా, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమవ్వడంతో అనూహ్యంగా 91 పరుగులకే ఆలౌటైంది. రాకెట్స్ బౌలర్లలో కిమ్ గార్త్(2-18), సమంతా బేట్స్(2-17), చార్లీ ఫిలిఫ్స్(2-12)లు రెండేసి వికెట్లతో రాణించగా.. సథర్లాండ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఫలితంగా డానియల్ గిబ్సే సారథ్యంలోని ఆరెంజ్ ఆర్మీ ఈ లీగ్ ఫైనల్లో రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.
Rampant Rockets rip through Sunrisers Leeds at Lord’s!
The second-lowest total in a Hundred final – the lowest batting first 😱#TheHundred #TheHundredFinal pic.twitter.com/Lrv9S05J00
— Cricinfo (@cricinfo) August 16, 2026