Handloom Union : రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR)ను తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతి కుమార్, కార్యదర్శి ముషం నరహరి కోరారు. సోమవారం సాయంత్రం వీరు కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి చేనేత కార్మిక సంఘం రీలే నిరాహార దీక్షలకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద రీలే నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వనం శాంతి కుమార్, కార్యదర్శి ముషం నరహరిలు కేటీఆర్‌కు తెలిపారు. మార్చి 23, 24, 25వ తేదీలలో తమ సంఘం రీలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి సౌహార్థ సందేశం ఇవ్వాల్సిందిగా వారు సిరిసిల్య ఎమ్మెల్యేను కోరారు. వారి విజ్ఞప్తిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. తాను తప్పకుండా రిలే నిరాహార దీక్షా శిబిరానికి వస్తామని ఆయన హామీ ఇచ్చారు.