Ajay Bhupathi | ‘మంగళవారం 2’పై అజయ్ భూపతి బిగ్ అప్డేట్.. ఈసారి సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న సీక్వెల్!
Ajay Bhupathi | తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడిగా సంచలన విజయాన్ని అందుకున్న ఆయన, ‘మహాసముద్రం’ తో నిరాశపరిచినా, ‘మంగళవారం’ చిత్రంతో మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఆ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Ajay Bhupathi | తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడిగా సంచలన విజయాన్ని అందుకున్న ఆయన, ‘మహాసముద్రం’ తో నిరాశపరిచినా, ‘మంగళవారం’ చిత్రంతో మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఆ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రషా తడానీ హీరోయిన్గా నటిస్తుండగా, మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘మంగళవారం’ చిత్రానికి సీక్వెల్‌పై వస్తున్న వార్తలకు అజయ్ భూపతి అధికారికంగా స్పందించారు. ‘మంగళవారం 2’ తప్పకుండా తెరకెక్కుతుంది. ఈసారి ప్రేక్షకులు ఊహించని స్థాయిలో కథను సిద్ధం చేస్తున్నాం. మొదటి భాగానికి పూర్తి భిన్నంగా, మరింత థ్రిల్లింగ్ అనుభూతిని అందించేలా సినిమా ఉంటుంది’ అని తెలిపారు. ఈసారి కథలో సూపర్ నేచురల్ అంశాలకు పెద్దపీట వేస్తున్నామని అజయ్ భూపతి వెల్లడించారు. ప్రతి పాత్ర, ప్రతి సంఘటన ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేసేలా కథను రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ పనుల్లో పూర్తిగా బిజీగా ఉన్నానని, ఆ సినిమా విడుదలైన తర్వాత పూర్తిస్థాయిలో ‘మంగళవారం 2’ స్క్రిప్ట్‌పై దృష్టి పెడతానని తెలిపారు.
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ‘మంగళవారం 2’ కథను అజయ్ భూపతి దర్శకుడు కొరటాల శివకు వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆయన తన నిర్మాణ సంస్థ యువసుధా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘మంగళవారం’ సినిమాలో గ్రామీణ వాతావరణం, వరుస రహస్య మరణాలు, పాయల్ రాజ్‌పుత్ నటన, అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రెండో భాగంలో సూపర్ నేచురల్ అంశాలు కూడా జతకానుండటంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. అజయ్ భూపతి తాజా వ్యాఖ్యలతో ‘మంగళవారం 2’ టాలీవుడ్లో ఇప్పటి నుంచే హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

