కారేపల్లి జూలై 24 : తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఖమ్మం జిల్లా సింగరేణి మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనీషా లక్ష్మి మదన్‌లాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వాంకుడోత్ జగన్, తాత వెంకన్న డొంకేనా రవీందర్ ఇస్లావత్ బన్సీలాల్ మోహన్ భగవాన్ లాల్ గంగారబోయిన సత్యం, రవీందర్ రెడ్డి,పిల్లి వెంకటేశ్వర్లు,సంపత్ మాలోత్ స్వామి, జూపల్లి కృష్ణ వికాస్ సోమందుల నాగరాజు,కొనగండ్ల శ్రీకాంత్, వాంకుడోత్ పూర్ణ,పొడుగు హరీష్,భూక్య మధు, పోతు రాములు,రామకృష్ణ,శ్రీనాథ్, నామ శంకర్ తదితరులు పాల్గొన్నారు.