KTR | ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ పోరుబాట.. నల్లచొక్కాతో హాజరైన కేటీఆర్
KTR | ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది
KTR | ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బర్త్ డే వేడుకలను సైతం రద్దు చేసుకుని, నల్ల చొక్కాతో ఆయన నిరసన పాల్గొన్నారు. ఆర్ఎస్ పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్దకు విద్యార్థులు ఉప్పెనలా తరలివచ్చారు.
విద్యార్థులకు అండగా కేటీఆర్
తన 50వ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న కేటీఆర్ విద్యార్థి ఉద్యమానికి అండగా నిలిచారు.హైదరాబాద్ వేదికగా తలపెట్టిన నిరసనలో ప్రత్యక్షంగా పాల్గొనాలని సంకల్పించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులు, నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటనున్నారు. నాడు ఓట్ల కోసం యువతకు అలవిగాని హామీలు గుప్పించి గద్దెనెక్కిన తర్వాత పాలకులు చేస్తున్న మోసాలను ఎండగట్టనున్నారు. తప్పుడు వాగ్దానాలిచ్చిన ప్రభుత్వాల మెడలు వంచే దిశగా కార్యోన్ముఖులను చేయనున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత కోసం చేపట్టనున్న కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణలో తీసుకువచ్చే సంస్కరణలపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.
ఇందిరా పార్క్కు చేరుకున్న కేటీఆర్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ యువతతో కలిసి కేటీఆర్ నిరసన https://t.co/BELpuxt1z0 pic.twitter.com/bCG93YEeH3
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

