చుంచుపల్లి, సెప్టెంబర్ 22 : ఆయుర్వేద వైద్య దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో చుంచుపల్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వారు విద్యానగర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో మంగళవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఏడీ చుంచుపల్లి మెడికల్ ఆఫీసర్ డా.ఈ.ఉషారాణి, మొరంపల్లి బంజరు ఆయుర్వేద వైద్యాధికారి డా.జయ 70 మంది సీనియర్ సిటిజన్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు అందించారు. యోగా ఇన్స్ట్రక్టర్ కె.కమలారాణి వృద్ధులచే యోగాసనాలు చేయించి, వృద్ధాప్యంలో చేయాల్సిన ఆసనాలు, వాటి ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సురేష్, ఫార్మసిస్ట్ కె.రామకృష్ణ, ఎస్ఎన్ఓ వి.దిద్దుబాబు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

సీనియర్ సిటిజన్లకు ఆయుర్వేద వైద్య పరీక్షలు