Rekha Vedavyas | ఇప్పటికీ సింగిలే.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నవారు మెసేజ్ చేయండి..!
Rekha Vedavyas | ఒకప్పుడు ఆనందం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ రేఖ వేదవ్యాస్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో రేఖ వేదవ్యాస్ మాట్లాడుతూ.. తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. సల్మాన్ ఖాన్‌లాగే నేనూ సింగిల్‌గానే ఉండిపోతానేమో అంటూ నవ్వేశారు.
Rekha Vedavyas | ఒకప్పుడు ఆనందం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ రేఖ వేదవ్యాస్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో రేఖ వేదవ్యాస్ మాట్లాడుతూ.. తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. సల్మాన్ ఖాన్‌లాగే నేనూ సింగిల్‌గానే ఉండిపోతానేమో అంటూ నవ్వేశారు. తాను ఇంకా సింగిల్‌గా ఉన్నానని చెప్పినా చాలామంది నమ్మరని,ఎవరో ఒకరు ఉంటారులే అని అనుకుంటారని అన్నారు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు రేఖ ఎంతో పరిపక్వతతో సమాధానం ఇచ్చారు. యవ్వనంలో జీవిత భాగస్వామి గురించి ఎన్నో అంచనాలు, పెద్ద జాబితాలు ఉండేవని, కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవని చెప్పారు.
పర్ఫెక్ట్ మనిషి ఎవరూ ఉండరు. నేనూ పర్ఫెక్ట్ కాదు. నన్ను నిజంగా ప్రేమించే మంచి మనసున్న వ్యక్తి దొరికితే చాలుఅని తెలిపారు. ఎత్తు, రంగు, రూపం వంటి విషయాలకు తాను ప్రాధాన్యం ఇవ్వనని, మంచి హృదయం ఉంటే అదే జీవితాంతం నిలిచే అందమని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడుతూ.. నిజంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నవారు తన ఇన్స్టాగ్రామ్ ఐడీ anandam_rekhaకు మెసేజ్ చేయొచ్చని చెప్పారు. అయితే టైమ్‌పాస్ కోసం కాదు, జీవిత భాగస్వామిగా ఆలోచించే వారు మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేశారు. ప్రేమ, క్రష్, ఇన్ఫ్యాచుయేషన్, ఆబ్సెషన్ మధ్య తేడాను కూడా రేఖ వివరించారు. ఇన్ఫ్యాచుయేషన్ అంటే వారితో రిలేషన్లో ఉంటే బాగుంటుందని అనిపించడం.ఆబ్సెషన్ మాత్రం ప్రమాదకరమని, “వాళ్లు నాకే కావాలి” అనే స్వార్థ భావన అని చెప్పారు.ప్రేమలో మోసం చేసే వారికి కర్మ తప్పదని, ప్రతి చర్యకు ఫలితం ఉంటుందని తాను గట్టిగా నమ్ముతానని తెలిపారు.
వన్‌సైడ్ లవ్ చాలా పవర్ఫుల్ అని అభిప్రాయపడిన రేఖ.. అయితే అది మనసులోనే దాచుకోకుండా, నిజంగా ప్రేమిస్తే సరైన సమయంలో ధైర్యంగా చెప్పాలని యువతకు సూచించారు. నిజమైన ప్రేమను గౌరవించి, కుటుంబ సభ్యుల అంగీకారంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆమె సలహా ఇచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

