ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని నెడుమారన్ బాంబు పేల్చాడు. ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి ఈలం యుద్ధం చేస్తారని చెప్పాడు.
రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసిచ్చింది. ఈ నెల 15 లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నది. లోక్‌సభలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని సూచించింది.
భూకంపాలు వరుసగా సంభవిస్తూ మనల్ని భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉన్నది. ఇవాళ ఉదయం అసోంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.0 గా ఉన్నది.
భారతదేశం ముస్లింల మాతృదేశమని, ఇతర ప్రాంతాల నుంచి ఈ మతం వచ్చిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. భారత పౌరుల మధ్య వివక్ష ఉండకూడదనే తమ సంస్థ విధానమన్నారు.
ఢిల్లీ ప్రైవేట్ డిస్కం బోర్డుల్లోని ఆప్ నేతలను ఎల్జీ తొలగించారు. వీరి స్థానంలో ఇద్దరు ప్రభుత్వ అధికారులను నామినీలుగా నియమించారు. గవర్నర్ చర్యను రాజ్యాంగవిరుద్ధం అని ఆప్ విమర్శించింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాంటీ కాపీయింగ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఇకపై పేపర్ లీక్ చేసేవారికి చుక్కలు చూపించనున్నారు.
గూఢచర్యం కేసులో బీజేపీ నేతలు కేజ్రీవాల్ ఇంటి వద్ద నిరసనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళలు మసీదులో నమాజ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. అయితే, పురుషులతో కలిసి నమాజ్ చేయడానికి ఇస్లాం అనుమతించదని పేర�
మమతను కలాం, వాజపేయితో గవర్నర్ పోల్చారు. నియంతలు కూడా మంచి రైటర్లే అని బీజేపీ నేత దుయ్యబట్టారు. కాగా, గవర్నర్-సీఎం కలిసి పనిచేస్తుంటే బీజేపీకి అసూయగా ఉన్నదని టీఎంసీ పేర్కొన్నది.
జమ్ము కశ్మీర్లో కూల్చివేతలకు నిరసనగా మెహబూబా ముఫ్తీ ఢిల్లీ విజయ్ చౌక్‌లో ఆందోళనకు దిగారు. ఆమెను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు పీడీపీ నేతలు కూడా అరెస్టయ్యారు.