హిందువు అనే పదానికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కొత్త అర్ధం చెప్పారు. ఇక్కడ పుట్టిన వారు, ఇక్కడి గింజలు తిని ఇక్కడి నదుల నీరు తాగినవారంతా హిందువులే అని తెలిపారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సులను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ 17, సీపీఐ(ఎం) 43 స్థానాల్లో, మొత్తం స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది.
రాహుల్ పాదయాత్ర ఇవాళ తిరిగి ప్రారంభమైంది. భద్రతా లోపం కారణంగా శుక్రవారం యాత్ర నిలిచిపోయింది. ఇవాళ చుర్చు నుంచి పంథా చౌక్ ట్రక్ యార్డ్ వరకు యాత్ర కొనసాగుతుంది.
Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఏడాదికి సంబంధించి పద్మవిభూషణ్, పద్మ భూషణ్, 25 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్‌లో వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యత్నించిన నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ రద్దయింది. జమ్ములో భారీ వర్షాల కారణంగా రద్దు చేశారు. రేపు గణతంత్ర దినం సందర్భంగా విరామం తీసుకుని 27 న యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.
పుణెలో విషాదం చోటుచేసుకున్నది. భీమా నది ఒడ్డున నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమీపంలో మరో ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు.
BBC Documentary | భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపుతోంది. అన్ని ఆధారాలు సేకరించి, పూర్తి విశ్లేషణ చేసిన తర్వాతే డాక్యుమెంటరీని రూపొందించామని బీబీసీ చెబుతుంటే.. బీజేపీ న�
చండీగఢ్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపే లేఖ వచ్చింది. దాంతో కోర్టు కాంప్లెక్స్‌ను ఖాళీ చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బాంబును గుర్తించే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమై ఉన్నాయి.