గుజరాత్ మోర్బీ వంతెన రెనోవేషన్ చేపట్టిన సంస్థ యజమాని అరెస్ట్‌కు పోలీసులు వారంట్ జారీ చేశారు. వంతెన కూలిన 3 నెలల తర్వాత చర్యలకు దిగడంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
లడఖ్‌లో నానాటికి వాతావరణ పరిస్థితులు తీసికట్టుగా తయారవడం పట్ల సామాజిక సంస్కరణవాది సోనమ్ వాంగ్‌చుక్ విచారం వ్యక్తం చేశారు. లడఖ్‌ను కాపాడేందుకు ప్రధాని మోదీ తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
తన నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి రోడ్లే కారణమంటున్నారు అక్కడి బీజేపీ ఎమ్మెల్యే నారాయణ పటేల్. రోడ్లు అధ్వానంగా ఉంటే ప్రమాదాలు జరగవనే అర్థమొచ్చేలా ఆయన మాట్లాడారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెనరేటెడ్ వీడియోలతో ఎలా మోసపోతున్నది తెలిపే వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా శనివారం షేర్ చేశారు. ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటున్నది.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాపై ఛార్జిషీట్ సిద్ధమైంది. దాదాపు 3 వేల పేజీలతో రెడీగా ఉన్న ఈ ఛార్జిషీట్‌ను నిపుణులు సమీక్షిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ ఎవరని అసోం సీఎం హేమంత బిస్వ శర్మ ప్రశ్నించారు. సినిమా గురించి షారుఖ్ ఫోన్ చేస్తే విషయం పరిశీలిస్తానని చెప్పారు. డాక్టర్ బెజ్బరువా - పార్ట్ 2’ సినిమా చూడాలని పిలుపునిచ్చారు.
రాహుల్‌గాంధీని ఫరూక్ అబ్దుల్లా ఆకాశానికెత్తారు. రాహుల్‌ను ఆది శంకరాచార్యతో పోల్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన రెండో వ్యక్తి రాహుల్ అని కొనియాడారు.
ప్రధాని మోదీ ఓ ర్యాలీలో పాల్గొనడానికి ముందు నకిలీ సైనికుడొకరిని గుర్తించారు. గార్డ్స్ రెజిమెంట్ నాయక్ అని చెప్పిన రామేశ్వర్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ముంబై పోలీసులు విచారిస్తున్నారు.
జార్ఖండ్‌లోని గొడ్డా ప్రాంతంలో జరపతలపెట్టిన బొగ్గు తవ్వకాలను ఆదివాసీలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేయగా.. ఆదివాసీలు బాణాలతో దాడికి పాల్పడ్డారు.
ఉత్తర భారతదేశం చలిగాలుల గుప్పిట్లో గజగజలాడుతున్నది. ఢిల్లీ, కాన్పూర్‌లో గత చలిగాలుల రికార్డులు బద్దలయ్యాయి. యూపీ, ఉత్తరాఖండ్‌లో వానలు పడే సూచనలున్నాయి.
SGPC Dhami | మొహలీలో ఎస్జీపీసీ చీఫ్ ధామి కారుపై అటాక్ జరిగింది. సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ ఆందోళన చేస్తున్న వారు ధామి కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు.