Morbi Bridge | మోర్బీ వంతెన కూలిన ఘటనలో.. కోర్టులో లొంగిపోయిన జైసుఖ్ పటేల్
మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడు జైసుఖ్ పటేల్ కోర్టులో లొంగిపోయాడు. ఆయనను కోర్టు రిమాండ్‌కు పంపింది. ఒరెవా గ్రూప్ యజమానిగా జైసుఖ్ పటేల్ ఉన్నారు.
Morbi Bridge | గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరెవా గ్రూప్‌నకు చెందిన జైసుఖ్ పటేల్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అతడ్ని రిమాండ్‌కు తరలించింది. ఈయనపై ఇంతకు ముందు మోర్బీ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. వంతెన కుప్పకూలిపోయినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. సెషన్స్ కోర్టులో పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపు జరుగనున్నది. ఈలోపు ఆయన కోర్టులో లొంగిపోయారు. 2022 అక్టోబర్ 30న మోర్బీ వంతెన కూలిపోయిన ప్రమాదంలో 135 మంది మరణించారు.
ఈ కేసులో గుజరాత్ పోలీసులు 1262 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. జైసుఖ్ పటేల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. జనవరి 24న గుజరాత్ కోర్టు పటేల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్‌లో సంఘటన జరిగినప్పటి నుంచి జైసుఖ్ పటేల్ కనిపించకుండా పోయారని, చార్జిషీట్లో ‘పరారీ’గా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒరేవా గ్రూప్‌కు చెందిన నలుగురు ఉద్యోగులతో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు ఈ నెల 20 న మోర్బీ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే నెల 1 వ తేదీకి వాయిదా పడింది.
బ్రిటీష్ కాలం నాటి వంతెన నిర్వహణ బాధ్యతను ఎలాంటి గత అనుభవం లేని ఒరెవా గ్రూప్‌నకు గుజరాత్ ప్రభుత్వం అప్పగించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. వంతెనపైకి వెళ్లే వ్యక్తుల సంఖ్యపై పరిమితి లేకపోవడం, టిక్కెట్ల విక్రయంపై నియంత్రణ లేకపోవడం వంటి కారణాలతో వంతెన నియంత్రణ కోల్పోయిందని వంతెన కుప్పకూలడానికి దారితీసిన అంశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం తమ ఛార్జిషీట్లో పేర్కొన్నది. అలాగే, నిపుణుల సంప్రదింపులు లేకుండానే మరమ్మతులు చేయడం వంటి లోపాల వల్ల కూలిందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

