CJ appointments | నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు చీఫ్ జస్టిస్లను నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. కొత్తగా నియమితులైన చీఫ్ జస్టిస్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సోనియా గిరిధర్ గోకని, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సందీప్ మెహ్తా, త్రిపుర సీజేగా జస్టిస్ జస్వంత్ సింగ్, జమ్ము కశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ కోటిశ్వర్ సింగ్ నియమితులయ్యారు.
అంతకుముందు గత సోమవారం నాడు అలహాబాద్, కర్ణాటక, మద్రాస్ హైకోర్టుల్లో కూడా పలువురు న్యాయవాదులు, జ్యుడీషియల్ అధికారులను జడ్జీలుగా నియమిస్తూ కేంద్రం నోటిఫై చేసింది. అదేరోజు సుప్రీంకోర్టులో నియమించిన ఐదుగురు న్యాయమూర్తుల చేత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.