Assam Earthquake | అసోంలోని నాగోన్‌లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4 గా నమోదు
భూకంపాలు వరుసగా సంభవిస్తూ మనల్ని భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉన్నది. ఇవాళ ఉదయం అసోంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.0 గా ఉన్నది.
Assam Earthquake | అసోంలోని నాగోన్ పట్టణంలో ఆదివారం సాయంత్రం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. 4.18 గంటలకు నాగోన్ పరిధిలోని 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ విషయాన్ని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. అయితే, ఎంత మేర ప్రభావం ఉన్నదనే విషయాలను వెల్లడించలేదు.
నాగోన్ పట్టణంలో కంపించిన భూమి అక్కడి ప్రజలు, నివాసాలపై పెద్దగా ప్రభావం లేనట్లుగా తెలుస్తున్నది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0 గా ఉన్నదంటే చాలా చిన్న భూకంపమని నిపుణులు చెప్తున్నారు. అయితే తుర్కియే, సిరియాలలో నమోదైన భూకంప తీవ్రత 7.8 గా నమోదైంది. అక్కడ భూకంప తీవ్రత కారణంగా దాదాపు 28 వేల మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది తీవ్రగాయాలపాలయ్యారు.
గత కొన్ని రోజులుగా మన దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపిస్తూనే ఉన్నది. గుజరాత్‌లోని సూరత్‌లో కూడా స్వల్ప భూకంపం వచ్చింది. హజిరా జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో 5.2 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం కనిపించింది. దీని తీవ్రత 3.8 గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ నెల 4 వ తేదీన మణిపూర్‌లోని ఉఖ్రుల్ ప్రాంతంలో ఉదయం 6.14 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

