వనపర్తి, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం నాగరాల గుట్ట సమీపంలోని ఓ మామిడి తోటలో మంగళవారం ఉదయం పునుగు పిల్లి అనారోగ్యంతో గ్రామస్తులకు తారసపడింది. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారమివ్వగా వారు సాయంత్రం అక్కడికి చేరుకొని దాన్ని వనపర్తికి తీసుకెళ్లారు.
అనారోగ్యంతో ఉండటంతో పశువైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. మరో రెండు, మూడు రోజులు చికిత్స అందించాలని వైద్యులు సూచించగా అటవీ కార్యాలయానికి తరలించారు. అంతలోనే మృత్యువాత పడింది.