న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా(Pawan Khera)కు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ మంజూరుతో ఖేరాను ఢిల్లీ కోర్టు విడుదల చేయనుంది. ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే కేసుకు సంబంధించి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పవన్ ఖేరాను అసోం పోలీసులు అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది.
రాయ్‌పూర్‌కు వెళుతుండగా విమానం నుంచి కిందకు దించి ఖేరాను అరెస్ట్ చేశారని రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఖేరాపై దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను కలిపి విచారించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పవన్ ఖేరాకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో దాఖలైన ఎఫ్ఐఆర్లను కలపాలని కోరారు.
తాను పొరుపాటున నోరుజారానని, క్షమించాలని కాంగ్రెస్ నేత కోరారని ఆయన తరపు న్యాయవాది సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. పవన్ ఖేరాను అరెస్ట్ చేశారని, ట్రాన్సిట్ రిమాండ్ కోసం ఆయనను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాల్సి ఉందని అసోం పోలీసుల తరపున వాదించిన న్యాయమూర్తి పేర్కొన్నారు.
Read More :
IAS Vs IPS | నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలి, క్షమాపణలు చెప్పాలి.. రూపకు రోహిణి నోటీసులు..!
Zombie Drug | జాంబీలుగా మార్చేస్తున్న కొత్త డ్రగ్.. అమెరికాలో కలకలం