Zombie Drug | జాంబీలుగా మార్చేస్తున్న కొత్త డ్రగ్.. అమెరికాలో కలకలం
Zombie Drug | అమెరికాలో ఓ కొత్త డ్రగ్ కలకలం సృష్టిస్తున్నది. ‘జైలజీన్ (Xylazine)’ అనే డ్రగ్ ఓవర్ డోసు కారణంగా ప్రజల శరీర చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా కనిపిస్తుందట. ‘ట్రాంక్'గా కూడా పిలిచే ఈ మందు.. ఇప్పుడు అమెరికాలోని మెజారిటీ నగరాల్లో ప్రజలపై తీవ్ర ప్రభావాలతో అలజడి సృష్టిస్తున్నది.
Zombie Drug | వాషింగ్టన్, ఫిబ్రవరి 22: అమెరికాలో ఓ కొత్త డ్రగ్ కలకలం సృష్టిస్తున్నది. ‘జైలజీన్ (Xylazine)’ అనే డ్రగ్ ఓవర్ డోసు కారణంగా ప్రజల శరీర చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా కనిపిస్తుందట. ‘ట్రాంక్’గా కూడా పిలిచే ఈ మందు.. ఇప్పుడు అమెరికాలోని మెజారిటీ నగరాల్లో ప్రజలపై తీవ్ర ప్రభావాలతో అలజడి సృష్టిస్తున్నది. దేశంలోని చాలా నగరాల్లో ఈ మెడిసిన్ కనిపిస్తున్నదని టైమ్ మ్యాగజైన్ పేర్కొన్నది. ఈ జైలజీన్ డ్రగ్ జంతువులకు వినియోగించే మందు అని, అయితే దీన్ని మధ్యస్థం నుంచి తీవ్ర ఒంటి నొప్పులను తగ్గించుకొనేందుకు హెరాయిన్ మాదిరిగా అధికంగా వినియోగిస్తున్నారని తెలిపింది.
మొదటగా ఫిలడెల్ఫియా నగరంలో కనిపించిన ఈ డ్రగ్.. తర్వాత శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజెల్స్ వంటి నగరాలకు కూడా పాకింది. జంతువులకు వినియోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదించిన ఈ జైలజీన్ మానవులకు సురక్షితం కాదని, దీన్ని ఓవర్ డో స్ తీసుకొన్న వారికి రివర్స్ చికిత్స కింద ఇచ్చే నాలోక్సోన్‌కు కూడా స్పందించదని నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రాంక్ డోప్ అనేది ఫెంటానిల్ మిశ్రమమని, ఇది అమెరికా యువత జీవితాలను నాశనం చేస్తున్నదని స్కై న్యూస్ పేర్కొన్నది. ఈ వెటర్నరీ డ్రగ్‌ను తక్కువ ధరకే ఏకంగా వీధుల్లోనే అమ్మేస్తుండటం మరింత ఆందోళనకరమైన అంశమని తెలిపింది. ఈ డ్రగ్ దేశమంతటా వ్యాప్తిచెందితే.. అది ప్రజల ఆరోగ్యానికే ముప్పుగా మారే ప్రమాదం ఉన్నదని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Xylazine
- Zombie
- Zombie Drug
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

