Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (వీరోష్) పెళ్లి వేడుకలు ఘనంగా ముగుస్తున్నాయి. ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న వీరి వివాహం అత్యంత ప్రైవేట్‌గా జరిగిన విషయం తెలిసిందే. కాగా రేపు (మార్చి 4, 2026) హైదరాబాద్‌లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు సంబంధించి ‘టీమ్ విరోష్’ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తుంది.
ఈ రిసెప్షన్‌కు ఆహ్వానించబడిన అతిథులకు మాత్రమే అనుమతి ఉండబోతున్నట్లు సమాచారం. ప్రతి అతిథికి ఒక ప్రత్యేకమైన ఒకసారి మాత్రమే ఉపయోగించగల QR కోడ్‌ను పంపినట్లు సమాచారం. ఎంట్రీ వద్ద దీనిని స్కాన్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించబోతున్నారు. అలాగే ఆహ్వాన పత్రిక మరియు క్యూఆర్ కోడ్ లేని అభిమానులు, ఇతరులు ఎవరూ వేదిక వద్దకు రావద్దని టీమ్ విరోష్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ వేడుక జరిగే ప్రాంతం మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఉంటుందని, భద్రతా కారణాల దృష్ట్యా ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.