ఇండ్ల లబ్ధిదారులకు బెదిరింపులేల?
వారంలోగా గృహప్రవేశం చేయకుంటే ఇండ్ల ప్రొసీడింగ్ రద్దు చేస్తామని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను మంత్రులు బెదిరించడం ఏందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్ర భుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగా ణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
- వారంలో గృహప్రవేశం చేయకుంటే రద్దు చేస్తామనడం బెదిరింపే!
- వసతుల్లేకుండా ఎలా పంపిణీ చేస్తరు?
- కేసీఆర్ హయాంలో కట్టిన ఆ ఇండ్లను తామే కట్టామనడం దిగజారుడుతనమే
- హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 12, (నమస్తే తెలంగాణ): వారంలోగా గృహప్రవేశం చేయకుంటే ఇండ్ల ప్రొసీడింగ్ రద్దు చేస్తామని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను మంత్రులు బెదిరించడం ఏందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్ర భుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగా ణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రొసీడింగ్స్ రద్దు చేస్తామని చెప్పడమంటే బెదిరించడమేనని, అలాంటి బెదిరింపులు మానుకోవాలని హితవు పలికారు.
కేసీఆర్ హయాంలోనే కమలాపూర్‌లో ఒకో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఆగమేఘాలపై పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ఇండ్లు కేసీఆర్ కట్టించారని తాను వాస్తవం చెప్పినందుకు తనపైనే మంత్రి పొంగులేటి దురుసుగా ప్రవర్తించడాన్ని కౌశిక్‌రెడ్డి తప్పుబట్టారు. కేవలం ఐదుగురికే ఇండ్ల పట్టాలిచ్చి చేతులు దులుపుకొన్నారని, మిగతా లబ్ధిదారులందరికీ ఎప్పుడు పట్టాలిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే 10 రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి ప్ర భుత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హె చ్చరించారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ఇస్తున్న రూ.5 లక్షల సహాయం.. ప్రస్తుతం పెరిగిన నిర్మాణ వ్యయాలకు ఏమాత్రం సరిపోదని, ఒకో ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల వరకు ఖర్చవుతున్నదని చెప్పారు. ఇప్పటికే గృహప్రవేశాలు చేసిన 1,004 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఆఖరి విడత రూ.1,60,000 బకాయిల చొప్పున వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కమలాపూర్ పర్యటన సందర్భంగా పలువురు లబ్ధిదారులు అర్జీలు ఇవ్వడానికొస్తే మంత్రి పొంగులేటి వాటిని తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.
అప్పులపై అబద్ధాలేల పొంగులేటి?
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర అప్పులపై మంత్రి పొంగులేటి అసత్యాలు మాట్లాడారని, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాధానాన్నే తాను గుర్తుచేశానని కౌశిక్‌రెడ్డి వివరించారు. ‘పొంగులేటి బెదిరింపులకు బెదిరేది లేదు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో హౌసింగ్ అంశంపై చర్చ పెడితే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా‘ అని సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొ కి కాంట్రాక్టులు పొంది రూ.కోట్లు సంపాదించిన పొంగులేటి.. ఇప్పుడు వారిపైనే అక్కసు వెళ్లగక్కుతూ తిన్నింటి వాసాలు లెకబెడుతున్నారని ఆరోపించారు.
రేవంత్, పొంగులేటితో కాంగ్రెస్‌కు ముప్పే
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బొందపెట్టబోతున్నారని పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ ఆలోచించుకోవాలని సూచించారు. రెండేండ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి పొరుగు రాష్ట్రమైన ఏపీలో మాదిరిగా ఘోరంగా తయారవుతుందని జోస్యం చెప్పారు. అసలు కాంగ్రెస్ నాయకులను పకనబెట్టి పొంగులేటి లాంటి వలస కాంగ్రెస్ నేతలు గద్దెనెకి పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

