Child Marriage | బాల్య వివాహమే ఆ బాలికలకు వరం.. ఈ గ్రామంలో షాకింగ్ ఆచారం!
Child Marriage | ప్రతి ఇంట్లోనూ మహిళలు వ్యభిచారులు.. మగవారు వారికి విటులను తెచ్చే బ్రోకర్లు. ఇదేమీ అమానుషం, అన్యాయంగా ఆ గ్రామస్తులు భావించరు. తరతరాలుగా తమ జాతి పాటిస్తున్న ఆచారంగా భావిస్తుంటారు
Child Marriage | వడియా: ప్రతి ఇంట్లోనూ మహిళలు వ్యభిచారులు.. మగవారు వారికి విటులను తెచ్చే బ్రోకర్లు. ఇదేమీ అమానుషం, అన్యాయంగా ఆ గ్రామస్తులు భావించరు. తరతరాలుగా తమ జాతి పాటిస్తున్న ఆచారంగా భావిస్తుంటారు. అహ్మదాబాద్ నగరానికి 200 కి.మీ దూరంలో వడియా గ్రామం.. లింగ సమానత్వాన్ని ఆకాంక్షించే ఆధునిక భారతదేశానికి పూర్తిగా పూర్తి భిన్నమైన ప్రపంచంలా ఉంటుంది. సంచార జాతికి చెందిన ఈ గ్రామంలోని మహిళల్ని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెడుతుండగా, పురుషులు వారి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే వారీ దురాచారం నుంచి బయటపడటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. బాల్య వివాహ నిశ్చితార్థం లేదా వ్యభిచారం.. ఈ రెండే ఆ గ్రామంలోని బాలికల ముందున్న కఠినమైన ఎంపిక. తమ తల్లులు, అమ్మమ్మలు, సోదరీమణులు చిక్కుకున్న ఈ దుస్థితి నుంచి తప్పించుకునేందుకు ఇక్కడ ఏడేళ్ల వయసులోనే బాలికలకు వివాహ నిశ్చితార్థ్ధాలు చేస్తున్నారు. బాల్య వివాహం శాపం అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది.
అయితే ఆ శాపమే ఇక్కడి బాలికలకు వరం. బనస్కాంత జిల్లాలో ఉన్న ఈ గ్రామ జనాభా 750. ఈ గ్రామానికి చెందిన పురుషులు ప్రతి ఉదయం పాలన్పూర్-థారడ్ రహదారిపైకి వెళ్లి వరుసకడతారు. అయితే వారు వరుస కట్టేది ఏదైనా పనిచేసుకునేందుకు కాదు. తమ ఇంటి ఆడవారికి విటులను తీసుకువచ్చేందుకు. ఈ దురాచారాన్నుంచి బయటపడటానికి ఆ మహిళలకు ఉన్న ఏకైక మార్గం బాల్య వివాహం. దేశంలో బాల్య వివాహాలు నిషేధించినప్పటికీ అది వారికి మాత్రం వరప్రసాదమే. ఆడపిల్లలను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టకముందే వారికి నిశ్చితార్థం చేసి వేరే గ్రామాల వారికిచ్చి వివాహం చేయం ద్వారా దాని బారిన పడకుండా కాపాడుకోవచ్చునని అక్కడి ప్రజలు భావిస్తున్నారు, దానిని అనుసరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

