అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హెచ్‌సీఏ రోడ్‌మ్యాప్
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చేందుకు హెచ్‌సీఏ సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది.జంట నగరాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందిస్తోందని హెచ్‌సీఏ జిల్లా క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ (సీడీసీఐడీసీ) చైర్మన్ టి. శేష్‌నారాయణ్ వెల్లడించాడు.
- జోనల్ స్థాయిలో టీ10 టోర్నీలకు ప్లాన్
హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చేందుకు హెచ్‌సీఏ సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది.జంట నగరాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందిస్తోందని హెచ్‌సీఏ జిల్లా క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ (సీడీసీఐడీసీ) చైర్మన్ టి. శేష్‌నారాయణ్ వెల్లడించాడు. బుధవారం ఉప్పల్ సేడియంలో హెచ్‌సీఏ జిల్లా క్రికెట్ సంఘాల కార్యదర్శుల సమక్షంలో మాట్లాడుతూ.. ‘ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పాైట్లెన జిల్లాలకు హెచ్‌సీఏ సభ్యత్వం ఇచ్చే ప్రక్రియకు కొంత సమయం పడుతుంది.
ఈలోగా అన్ని జిల్లాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. వీటిలో సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ నియమించడంతో పాటు యువ ఆటగాళ్ల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించే మాజీ క్రికెటర్లకు వసతి కల్పించే ఏర్పాట్లూ ఉంటాయి. ఇందుకోసం రాబోయే రెండు వారాల్లో తగిన మైదానాలు, కార్యాలయాలను గుర్తించాలని ఆయా జిల్లాల ప్రతినిధులను కోరాం’ అని తెలిపాడు. జోనల్ అకాడమీలను ఏర్పాటు చేయడంతో పాటు, యువ క్రీడాకారులకు తమ సత్తా చాటుకోవడానికి మరో మంచి వేదికను కల్పించేందుకు జోనల్ స్థాయిలో టీ10 టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు వెల్లడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

