Esha Gupta | అబుదాబిలో చిక్కుకున్న ఈషా గుప్తా.. మూడు రోజుల తర్వాత ఢిల్లీ చేరుకున్నట్టు పోస్ట్
Esha Gupta | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలకి ఆటంకం ఏర్పడింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల నేపథ్యంలో పలు దేశాలు ఎయిర్‌స్పేస్‌ను మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Esha Gupta | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలకి ఆటంకం ఏర్పడింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల నేపథ్యంలో పలు దేశాలు ఎయిర్‌స్పేస్‌ను మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ఈషా గుప్తా అబుదాబిలో చిక్కుకుపోయి, మూడు రోజుల తర్వాత మార్చి 2న సురక్షితంగా ఢిల్లీకి చేరుకుంది. ఇంటికి చేరిన అనంతరం ఆ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఫిబ్రవరి 28న నేను ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాను. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. చుట్టూ గందరగోళం.. ఏం జరుగుతుందో ఎవరికీ స్పష్టంగా తెలియని పరిస్థితి అని ఈషా తెలిపారు. కొద్ది సేపటికే క్షిపణి దాడుల వార్తలు రావడం ప్రారంభమయ్యాయని, తర్వాతి క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొన్నదని ఆమె పేర్కొన్నారు. అక్కడున్న వారు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాడుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ గడిపారు. ఆ మూడు రోజులు నిజంగా మానసికంగా చాలా కష్టంగా అనిపించాయి అని చెప్పారు.
ఈ క్లిష్ట సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈషా గుప్తా ప్రశంసించారు. ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులకు ప్రత్యేకంగా భోజనం, తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించారు. నేను చెక్-ఇన్ పూర్తి చేయకముందే ఎయిర్పోర్ట్ మూసివేయడంతో తిరిగి అబుదాబిలోని హోటల్‌కు వెళ్లాను. అక్కడి సిబ్బంది ముఖాల్లో భయం కనిపించినా, ప్రయాణికులకు ఎక్కడా ఒత్తిడి కలగకుండా ఎంతో సమర్థంగా పనిచేశారు అని ఈషా పేర్కొన్నారు. ఇక ఈషా గుప్తాతో పాటు దుబాయ్‌లో తమిళ స్టార్ అజిత్ కుమార్, టాలీవుడ్ నటుడు మంచు విష్ణు, నటి సోనాల్ చౌహన్, బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈషా సురక్షితంగా భారత్ చేరుకోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నప్పటికీ, మిగిలిన వారంతా సురక్షితంగానే ఉన్నారనే అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Ajith Kumar
- America
- bollywood
- Dubai
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

