లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్వింటిన్ టరంటినో(Quentin Tarantino) .. తాజాగా జరిగిన మిస్సైల్ దాడిలో మృతిచెందినట్లు పుకార్లు వ్యాపించాయి. అయితే అవన్నీ తప్పుడు వార్తలు అని తేలింది. ఆ డైరెక్టర్ తన కుటుంబంతో పాటు క్షేమంగా ఉన్నట్లు టీఎంజెడ్ వెబ్సైట్ తన కథనంలో పేర్కొన్నది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ఇజ్రాయల్‌లో పడడం వల్ల ఫిల్మ్ డైరెక్టర్ టరంటినో మృతిచెందినట్లు సోషల్ మీడియాలో వార్తులు జోరుగా ప్రచారం అయ్యాయి. క్వింటిన్ ఫ్యామిలీ సగం రోజులు ఇజ్రాయెల్‌లో గడపగా, ఇంకా సగం రోజులు లాస్ ఏంజిల్స్‌లో గడుపుతుంటారు. క్వింటన్ భార్య డేనిల్లా పిక్.. ఓ ఇబ్రాయిలీ నటి. ఆమె మ్యూజీషియన్, మోడల్ కూడా. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇజ్రాయిల్‌లోనే జీవితం కొనసాగించేందుకు ఇష్టపడుతానని క్వింటిన్ గతంలో పేర్కొన్నాడు. ఇటీవల పాలస్తీనాతో వార్ జరిగిన సమయంలోనూ క్వింటన్ ఇజ్రాయెల్‌లోనే ఉన్నాడు. తాజాగా చేసిన ఇరాన్ దాడిలో క్వింటిన్ టరంటినో మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు వచ్చింది. దానికి వేల సంఖ్యలో అభిమానులు లైక్ కొట్టారు. ఇంకా ఆ డైరెక్టర్ మృతిచెందినట్లు ఏఐ ఇమేజ్‌లు కూడా జనరేట్ చేశారు. ఇజ్రాయల్‌లోని ఓ బాంబు షెల్టర్‌లో క్వింటిన్ ఉన్నట్లు పిక్స్ చేశారు. అయితే ఆ ఇమేజ్‌లన్నీ ఫేక్ అని తేల్చారు.
1963లో జన్మించిన క్వింటిన్.. మేటి చిత్రాలను తీశాడు. పల్ప్ ఫిక్షన్, రిజర్వాయర్ డాగ్స్, కిల్ బిల్, ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్, జాంగో అన్‌చెయిన్డ్ లాంటి చిత్రాలకు ఆయన డైరెక్షన్ చేశారు. క్వింటన్ తన చిత్రాల్లో హింసను అత్యంత కళాత్మకంగా చూపించడంలో దిట్ట.