Accidental deaths | పుణేలో ఘోరం.. డ్రైనేజీలో ఊపిరాడక నలుగురు దుర్మరణం
Accidental deaths | మహారాష్ట్రలోని పుణె పట్టణంలో ఘోరం జరిగింది. డ్రైనేజీ శుభ్రం చేసే ప్రయత్నంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పుణెలోని బారామతి ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రం విషాదం నింపింది.
పుణె: మహారాష్ట్రలోని పుణె పట్టణంలో ఘోరం జరిగింది. డ్రైనేజీ శుభ్రం చేసే ప్రయత్నంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పుణెలోని బారామతి ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రం విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే బారామతి ఏరియాలోని ఓ వీధిలో డ్రైనేజీ నిండిపోయి మురుగునీరు రోడ్డుపై పారుతోంది.
దాంతో స్థానికులు మోటార్ ద్వారా మురుగు నీటిని బయటికి తోడేసి శుభ్రం చేసే పనిలో పడ్డారు. అయితే కాసేపటికి మోటార్ పైపులో మురుగు తట్టడంతో ప్రవీణ్ అతోలే అనే వ్యక్తి ఆ పైపును క్లీన్ చేసేందుకు డ్రైనేజీలోకి దిగాడు. ఆ వెంటనే ఊపిరాడక లోపల పడిపోయాడు. దాంతో అతని తండ్రి.. కొడుకును కాపాడేందుకు డ్రైనేజీలో దిగి అతను కూడా ఊపిరాడక స్పృహ కోల్పోయాడు.
ఆ తర్వాత వాళ్లను కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా డ్రైనేజీలో దిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించారు. అనంతరం పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైనేజీ చాలా రోజులుగా మూసి ఉండటంతో విషవాయువులు నిండాయని, అందుకే ఒకరి తర్వాత ఒకరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

