Delhi | బైక్ ట్యాక్సీలు నడిపితే ఏడాది జైలుశిక్ష.. ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Delhi | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ సోమవారం సర్క్యులర్ జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని అందులో హెచ్చరించింది.
Delhi | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ సోమవారం సర్క్యులర్ జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని అందులో హెచ్చరించింది.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఉన్న బైక్లను ట్యాక్సీలుగా ఉపయోగించడం నిషేధమని పేర్కొన్నది. బైక్ ట్యాక్సీలు నడుపుతూ పట్టుబడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10వేల జరిమానా విధిస్తామని తెలిపింది. ఏడాదిపాటు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని వెల్లడించింది. బైక్ ట్యాక్సీ నడిపినవారి డ్రైవింగ్ లైసెన్స్ను 3 నెలలు రద్దు చేస్తామని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ban
- bike taxi
- Delhi
- National news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

