న్యూఢిల్లీ : షూటింగ్ జాతీయ సెలెక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ సత్తాచాటింది. మంగళవారం జరిగిన మహిళల 10మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఇషాసింగ్ 220.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఆకట్టుకుంది. ఇదే విభాగంలో పోటీపడ్డ ఒలింపిక్ చాంపియన్ మను భాకర్ (246.1), సాన్యం(241.9) వరుసగా తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు.
అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో హైదరాబాద్ షూటర్ ఇషాసింగ్ 580 స్కోరుతో అగ్రస్థానం దక్కించుకుంది. సురభిరావు(578), ముస్కాన్(577) ఆ తర్వాత ఉన్నారు. బుధవారం నుంచి కోచింగ్ క్యాంప్ మొదలుకానుంది.