నాలాల మరణాలకు జవాబేదీ?
మహానగరంలో తెరుచుకుని ఉన్న నాలాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్ (టీహెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- హైడ్రా, సైబరాబాద్ కమిషనర్‌కు హెచ్ఆర్సీ నోటీసులు
- మియాపూర్‌లో నాలాలో పడి వృద్ధుడు గల్లంతైన ఘటనపై
- స్పందించిన మానవ హకుల కమిషన్
- సుమోటోగా కేసు నమోదు చేసిన టీహెచ్‌ఆర్‌సీ చైర్పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్
- ఆగస్టు 25 నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని హైడ్రా, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశం
సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ ) : మహానగరంలో తెరుచుకుని ఉన్న నాలాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్ (టీహెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మియాపూర్ వైశాలీనగర్ రైల్వే బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా ఉన్న వరద నీటి కాల్వ (నాలా)లో పడి 75 ఏళ్ల బాలయ్య అనే వృద్ధుడు కొట్టుకుపోయిన విషాదకర ఘటనపై హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు (హెచ్ఆర్సీ నం. 3111/2026) చేసింది.
‘మృత్యు నాలాలు-ప్రాణాలను మింగేస్తున్న వరద నీటి కాల్వలు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ కథనంపై స్పందించిన హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్‌తో పాటు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్‌కు నోటీసులు పంపారు.
భద్రతా ప్రమాణాలు ఏవి?
నాలా విస్తరణ, పైప్ లైన్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కనీస భద్రతా చర్యలైన బారికేడింగ్, రక్షణ ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో వెలుతురు (లైటింగ్) ఏర్పాటు చేయకపోవడం పట్ల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు రాజ్యాంగం కల్పించిన జీవించే హకును భంగపరిచేలా అధికారుల నిర్లక్ష్యం ఉందనడంలో సందేహం లేదని స్పష్టం చేసింది. వర్షాకాలంలో ప్రతీ ఏటా ఇటువంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నా పౌర భద్రతను గాలికి వదిలేయడంపై కమిషన్ మండిపడింది.
ఆగస్టు 25లోగా నివేదిక ఇవ్వాలి
గల్లంతైన వృద్ధుడి కోసం జరుగుతున్న గాలింపు చర్యల పురోగతి, నాలా నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లు, బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలతో పాటు.. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకునే నివారణ చర్యలపై పూర్త వివరాలతో కూడిన నివేదికను ఆగస్టు 25న ఉదయం 11:00 గంటలకు తమ ముందు ప్రవేశపెట్టాలని హెచ్ఆర్సీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

