త్రీ ఇడియట్స్ సినిమాలో మాదిరిగా వాట్సాప్ వీడియో కాల్లో ఓ మహిళకు సీహెచ్సీ సిబ్బంది కాన్పు చేశారు. గైనకాలజిస్ట్ సూచనలు వింటూ 6 గంటల పాటు డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీపాప ఆరోగ్యంగా ఉన్నారు.
జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ స్థానాల పెంపుదలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్ కోర్టు ముందు ఉండగా డీలిమిటేషన్పై విచారణ చేపట్టలేమని ధర్మాసనం తెలిపింది.
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని నెడుమారన్ బాంబు పేల్చాడు. ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి ఈలం యుద్ధం చేస్తారని చెప్పాడు.
రాహుల్ గాంధీకి లోక్సభ సెక్రటేరియట్ నోటీసిచ్చింది. ఈ నెల 15 లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నది. లోక్సభలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని సూచించింది.
భూకంపాలు వరుసగా సంభవిస్తూ మనల్ని భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉన్నది. ఇవాళ ఉదయం అసోంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0 గా ఉన్నది.
భారతదేశం ముస్లింల మాతృదేశమని, ఇతర ప్రాంతాల నుంచి ఈ మతం వచ్చిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. భారత పౌరుల మధ్య వివక్ష ఉండకూడదనే తమ సంస్థ విధానమన్నారు.
ఢిల్లీ ప్రైవేట్ డిస్కం బోర్డుల్లోని ఆప్ నేతలను ఎల్జీ తొలగించారు. వీరి స్థానంలో ఇద్దరు ప్రభుత్వ అధికారులను నామినీలుగా నియమించారు. గవర్నర్ చర్యను రాజ్యాంగవిరుద్ధం అని ఆప్ విమర్శించింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాంటీ కాపీయింగ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఇకపై పేపర్ లీక్ చేసేవారికి చుక్కలు చూపించనున్నారు.