బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka polls) షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు పోటీ చేసే స్ధానాలపైనా స్పష్టత వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య వరుణ స్ధానంతో పాటు కోలార్ నుంచి కూడా బరిలో నిలవనున్నట్టు ప్రకటించారు.
మే 10న జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గంలో తన గెలుపుపై విశ్వాసం లేకపోవడంతో బదామి నుంచి కూడా బరిలో నిలిచానని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి గెలుస్తాననే విశ్వాసం ఉందని, కోలార్ నుంచి కూడా పోటీ చేయాలని ప్రజలు కోరడంతో కోలార్ టికెట్ తనకు కేటాయించాలని హైకమాండ్‌ను కోరానని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికల తర్వాత తాను ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. తాను వరుణ నియోజకవర్గ బిడ్డనని, ఇక్కడి ప్రజలు తనను ఆదరిస్తారనే విశ్వాసం ఉందని అన్నారు. తన చివరి ఎన్నికల్లో వరుణ నుంచి బరిలో దిగుతున్నానని పేర్కొన్నారు.శనివారం వెల్లడైన కాంగ్రెస్ తొలిజాబితాలో సీఎల్పీ నేత సిద్ధరామయ్యకు వరుణ నియోజకవర్గం నుంచి టికెట్‌ను కేటాయించారు. కేటాయించారు.
Read More :