Mallikarjun Kharge | అవినీతిపరుల కూటమికి మోదీ నాయకుడు.. ప్రధానిపై ఖర్గే ఫైర్
Mallikarjun Kharge | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi ) పై కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీల (central agencies)ను ఉసిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు.
Mallikarjun Kharge | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi ) పై కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీల (central agencies)ను ఉసిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఖర్గే బుధవారం వరుస ట్వీట్లు చేశారు.
బిలియనీర్ గౌతమ్ అదానీ షెల్ కంపెనీల (Gautam Adani shell companies)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలను ఖర్గే ప్రస్తావించారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20,000 కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారని ప్రశ్నించారు. ‘అదానీ షెల్ కంపెనీల్లో పెట్టబడి పెట్టిన రూ.20వేల కోట్లు ఎవరివి..? లలిత్ మోదీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, జతిన్ మెహతా తదితరులు మీ ‘భ్రష్టాచారి భగావో అభియాన్’ (Bhrashtachari Bhagao Abhiyan) కూటమిలో సభ్యులుగా ఉన్నారా..? ఈ కూటమికి కన్వీనర్ మీరేనా..? మిమ్మల్ని మీరు అవినీతి వ్యతిరేక యోధుడు అని చెప్పుకోవడం ద్వారా మీ ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాలు ఆపండి’ అంటూ ధ్వజమెత్తారు.
.@narendramodi जी
अडानी की Shell Cos में ₹20,000 Cr किसके हैं ?
ललित मोदी, नीरव मोदी, मेहुल चोकसी, विजय माल्या, जतिन मेहता आदि क्या आपके “भ्रष्टाचारी भगाओ अभियान” के सदस्य है ?
आप इस गठबंधन के Convenor हैं ?
खुद को Anti-Corruption Crusader बता Image Makeover बंद कीजिए!
1/3
— Mallikarjun Kharge (@kharge) March 29, 2023
‘అదానీ షెల్ కంపెనీల్లోకి అకస్మాత్తుగా రూ. 20,000 కోట్లు వచ్చాయి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మన డ్రోన్లు, క్షిపణుల అభివృద్ధికి ఎవరి డబ్బు ఖర్చు చేస్తున్నారు..? రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రశ్న ఎందుకు అడగడం లేదు..?’ అని ఖర్గే ప్రశ్నించారు.
‘మొదట మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కర్ణాటకలో మీ (బీజేపీ) ప్రభుత్వం 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఎందుకు ఆరోపణలు వచ్చాయి..? మేఘాలయలో నెంబర్-1 అవినీతి ప్రభుత్వంలో మీరు ఎందుకు పాలుపంచుకున్నారు..? రాజస్థాన్‌లోని సంజీవని కోఆపరేటివ్ స్కామ్ (Sanjivani Cooperative scam )లో, ఎంపీ (మధ్యప్రదేశ్)లో పోషణ్ స్కామ్ (Poshan scam), ఛత్తీస్‌గఢ్‌లో నాన్ స్కామ్ (Naan scam)లో బీజేపీ నేతలకు సంబంధం లేదా..?’ అని ఖర్గే మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
विपक्ष के 95% नेताओं पर ED,
और भाजपा में शामिल नेता Washing Machine से धुलकर साफ़ ?छप्पन इंच की छाती है तो JPC बैठाइये और 9 सालों में पहली बार सरेआम खुली प्रेस कॉन्फ़्रेंस कीजिये।
हाँ ! उनको जवाब दीजिएगा जो ये ना पूछे कि-
“आप आम कैसे खाते हैं”
या “आप थकते क्यों नहीं”!3/3
— Mallikarjun Kharge (@kharge) March 29, 2023
Also Read..
Taapsee Pannu | తాప్సీపై కేసు నమోదు.. ఓ మతాన్ని అవమానించేలా ప్రవర్తించిందంటూ ఫిర్యాదు
ChatGPT | నిందితుడి బెయిల్ పిటిషన్‌పై.. చాట్‌జీపీటీని న్యాయ సలహా కోరిన కోర్టు..!
India Corona | భారీ స్థాయిలో పెరిగిన కొత్త కేసులు.. ఐదు నెలల తర్వాత ఇదే ప్రథమం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

