Taapsee Pannu | తాప్సీపై కేసు నమోదు.. ఓ మతాన్ని అవమానించేలా ప్రవర్తించిందంటూ ఫిర్యాదు
Taapsee Pannu | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి తాప్సీ పన్ను (Taapsee Pannu)పై కేసు నమోదైంది. హిందువుల మతపరమైన మనోభావాలను తాప్సీ దెబ్బతీసిందంటూ బీజేపీ ఎమ్మెల్యే మాలిని గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ (Eklavya Singh Gaur) ముంబైలోని ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Taapsee Pannu | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి తాప్సీ పన్ను (Taapsee Pannu)పై కేసు నమోదైంది. హిందువుల మతపరమైన మనోభావాలను తాప్సీ దెబ్బతీసిందంటూ బీజేపీ ఎమ్మెల్యే మాలిని గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ (Eklavya Singh Gaur) ముంబైలోని ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకలవ్య సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మార్చి 12వ తేదీన ముంబయి (Mumbai) వేదికగా జరిగిన ‘లాక్మే ఫ్యాషన్ వీక్’ (Lakme Fashion Week)లో తాప్సీ పాల్గొని ర్యాంప్‌పై వాక్ (Ramp Walk) చేసింది. ఈ సందర్భంగా తాప్సీ శరీరమంతా కనిపించేలా ఎరుపు రంగు దుస్తుల్ని ధరించింది. ఆ డ్రెస్‌కు సెట్ అయ్యేలా లక్ష్మీదేవి పెండెంట్ (Goddess Lakshmis sculpture) ఉన్న ఖరీదైన బంగారు నెక్లెస్ (Necklace) ను వేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు తాప్సీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకరంగా ఉన్న దుస్తులు ధరించి లక్ష్మీదేవి నెక్లెస్ వేసుకోవడం సరికాదంటూ విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే తాప్సీ డ్రెస్సింగ్ పట్ల అసహనం వ్యక్తం చేసిన ఏకలవ్య గౌర్.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. అసభ్యకరమైన వస్త్రధారణతో లక్ష్మీదేవి పెండెంట్ ఉన్న నెక్లెస్‌ను ఆమె ధరించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. ఓ మతాన్ని అవమానించేలా తాప్సీ ప్రవర్తించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read..
Keerthi suresh | దసరా సెట్లో పశువులతో కీర్తి సురేష్ దోస్తీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు
ChatGPT | నిందితుడి బెయిల్ అంశంపై.. చాట్‌జీపీటీని న్యాయ సలహా కోరిన కోర్టు..!
India Corona | భారీ స్థాయిలో పెరిగిన కొత్త కేసులు.. ఐదు నెలల తర్వాత ఇదే ప్రథమం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

